Mahesh Babu About Joining Politics

Filmibeat Telugu 2018-04-14

Views 510

Mahesh Babu about joining politics. Politics is not an option for me says Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. కొరటాల దర్శకత్వం వహించిన శ్రీమంతుడు చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
భరత్ అనే నేను చిత్రం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేసేలా ఉంటుందని మహేష్ తెలిపారు. బలవంతగా తమ అభిప్రయాలని వారిపై రుద్దడం కాదు. కానీ సమాజం గురించి కూడా ఆలోచించవలసిన భాద్యత ఉంది అని మత్రమే ఈ చిత్రం గుర్తు చేస్తుందని అన్నారు. సినిమా అంతపెద్ద మీడియం అని మహేష్ అభిప్రాయ పడ్డారు.
ప్రజలకు సరైన భావజాలం చేరవేయడంలో సినిమాలు, స్టార్ ఇమేజ్ ఉపయోగపడుతుందని మహేష్ బాబు అన్నారు. ఎంత బలంగా వెళుతుందనేది సినిమాలోని కంటెంట్ పై ఆధారపడి ఉంటుందని మహేష్ తెలిపాడు.
రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని మహేష్ తెలిపారు. రాజకీయాలు తన ఆప్షన్ కాదని మహేష్ అన్నారు. సినిమా ద్వారా ఆడియన్స్ కి వినోదం అందించడమే తనకు తెలుసు అని అన్నారు.
నా సినిమా చూడడానికి ప్రేక్షకుడు పెట్టిన ఖర్చు వృధా అయిందనే భావన వారిలో కలగకూడదని తాను భావిస్తానని మహేష్ అన్నారు. సినిమా చూసాక వారు సంతృప్తిగా ఇంటికివెళ్లేలా తన సినిమాలు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానని, ఆ దిశగానే కష్టపడతానని మహేష్ తెలిపాడు.
తాను దర్శకత్వం వహించడం ఇప్పట్లో జరగదని మహేష్ అన్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటించడాన్ని ఆస్వాదిస్తున్నా. తాను దర్శత్వం వహించడానికి ఇంకా చాలా సమయం పట్టొచ్చు అని మహేష్ బాబు తెలిపారు.

Share This Video


Download

  
Report form