ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటకలో ఎక్కడికి వెళ్లినా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ వస్తున్నాడని తెలిసిన వెంటనే బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కారును అడ్డుకుని పిడిగుద్దులతో దాడి చేశారు.