చెన్నైలో మోడీ గో బ్యాక్ అంటూ నిరసనకారుల నినాదాలు..!

Oneindia Telugu 2018-04-12

Views 1.2K

Amid searing protests over the Cauvery dispute, Prime Minister Narendra landed in Chennai to inaugurate the Defence Expo 2018 on Thursday.

తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కావేరి నిరసనలు సెగలు తాకాయి. కావేరీ జలాలపై ఆందోళనకారుల నిరసనల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉదయం చెన్నై చేరుకున్నారు. డిఫెన్స్‌ ఎక్స్‌పో 10వ ఎడిషన్‌ను ప్రారంభించేందుకు నగరానికి మోడీ రావడంతో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. విమానాశ్రయం వద్ద ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతోపాటు 'మోడీ గోబ్యాక్' అని రాసిన బెలూన్లను ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న దర్శకుడు భారతీరాజాతోపాటు 250మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విమానాశ్రయానికి సమీపంలోని అలందూర్‌ ప్రాంతంలో కావేరీ జలాలపై బోర్డు ఏర్పాటును కోరుతూ నిరసనలు మిన్నంటాయి. కావేరీ జలాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు నిరసనల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీఎంకే, ఎండీఎంకే, ఇతర తమిళ సంఘాల నిరసనలతో ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. కావేరి ఆందోళనలకు రజినీకాంత్, కమల్ హాసన్‌లు కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, డిఫెన్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించే తిరువదాంతి, అడయార్‌లో జరిగే క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ కార్యక్రమానికి ప్రధాని హాజరవుతుండగా ప్రత్యేక రూట్‌లో ప్రధాని కాన్వాయ్‌ను మళ్లిస్తారు. ఎస్‌పీజీకి అదనంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని సీనియర్‌ పోలీసు అధికారులు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS