ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆరంభ వేడకులకు సర్వం సిద్ధమైంది. ఈ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్లు తమన్నా, జాక్వెలిన్ తమ డ్యాన్స్‌లతో అలరించనున్నారు.
బాల్ రోలింగ్ డ్యాన్స్‌తో అదరగొట్టిన వరుణ్ ధావన్:
ఐపీఎల్ 11వ సీజన్‌లో తొలి ప్రదర్శనను బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఇచ్చాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేశాడు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తుంటే అభిమానులంతా పూనకం వచ్చిన వారిలాగా ఊగిపోయారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.