Andhra Pradesh Chief Minister Chandrababu Naidu’s two and a half hour presence in Parliament’s Central Hall on Tuesday drew the attention of many prominent leaders as well as the media, but not Prime Minister Narendra Modi’s attention.
రాజకీయం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు బుధవారం ఆరోపించారు.అమరావతి అంటే అవినీతి అని వినిపిస్తోందని ఎద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ పరపతి దేశ రాజకీయాల్లో క్షీణించిందన్నారు.రాజధాని భ్రమలను చంద్రబాబు ఢిల్లీ మోసుకొచ్చారన్నారు.ఆయన చేస్తున్న వాదనలో వాస్తవం,చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదన్నారు.దేశమంతా తిరిగినా చంద్రబాబుకు మద్దతు దొరకదన్నారు.చిన్నాచితక నేతలను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మంగళ, బుధ వారాలు వివిధ పార్టీ నేతలతో భేటీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయంగా ఏపీకి రావాల్సింది, కేంద్రం ఇచ్చిన దానిని వివరిస్తూ రూపొందించిన 72 పేజీల నివేదికను వారికి అందిస్తున్నారు.
చంద్రబాబు అందిస్తున్న నివేదిక ప్రకారం ఈశాన్య రాష్ట్రాల వలె ఏపీకి కూడా పరిశ్రమలకు రాయితీ, హోదా ఇవ్వాలని చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్. కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్రం రూ.11,600 కోట్ల విలువైన భూములు ఇస్తే కేంద్రం ఇచ్చింది మాత్రం రూ.138 కోట్లు. కడపలో ఉక్కు పరిశ్రమ. 200 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటుకు తొలుత అంగీకరించినా ఇప్పుడు దానిని 100 మీటర్లకు కుదించి 4 లేన్లకు తగ్గించారని నివేదికలో పేర్కొన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తే బీజేపీకి లేని బాధ, దురద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎందుకని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. . గందరగోళం నడుమ లోకసభ పదేపదే వాయిదా పడుతోందని, లోకసభనే నడపలేని వారు దేశాన్ని ఏమి పాలిస్తారన్నారు.
ప్రధాని మోడీ దేశంలోనే అత్యంత పిరికిపంద అని మంత్రి జవహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడారు.ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయాలని చేస్తే కుదరదని, బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. బీజేపీ కొత్త స్నేహం కుదుర్చుకుందని, పీఎంవోను సైతం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రలోభపెడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఏపీకి అన్యాయం చేశాయన్నారు.