కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు : రాహుల్ గాంధీ రోడ్ షో కు రంగం సిద్ధం

Oneindia Telugu 2018-03-29

Views 204

After the visit by national BJP president Amit Shah and the grand roadshow, the district congress is also gearing up to put up a road show for AICC president Rahul Gandhi’s visit to the city.

కర్ణాటకలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వ సన్నద్ధం అవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శివమొగ్గ జిల్లా పరిధిలో మహా రోడ్ షో విజయవంతంగా నిర్వహించిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ శివమొగ్గ జిల్లా పరిధిలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించాలని సంకల్పించింది. అందుకు అనుగుణంగా భారీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చేనెల మూడో తేదీన రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహణకు రంగం సిద్ధం అవుతోంది.
ఏఐసీసీ, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మూడో తేదీన మధ్యాహ్నం 11.30 గంటలకు జిల్లా కేంద్రం శివమొగ్గ నగరంలో అడుగు పెడుతూనే రోడ్ షోకు శ్రీకారం చుడతారు. హొన్నాలీ మీదుగా దవణగెరె వరకు రాహుల్ రోడ్ షో సాగుతుంది. శివమొగ్గ జిల్లా బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప సొంత గడ్డ కావడంతో రాహుల్ గాంధీ రోడ్ షోకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వ ప్రతిభతోపాటు దేశ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారిన కర్ణాటకలో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే మరొకసారి బీజేపీ గెలుపొందడం ఆనవాయితీగా కనిపిస్తున్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు మధ్య ఏడాది సమయం మాత్రమే ఉన్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 2014 లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రాతిపదికన బీజేపీ పట్టు సాధించింది. అంతకు ముందు 1977 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే 1989 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పరస్పర విరుద్ధంగా వచ్చాయి. అదే పరిస్థితి 2013లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2014లో అత్యధికంగా 17 లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుపొందింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకున్నది.
రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 122, బీజేపీ, జేడీఎస్ చెరో 40 స్థానాలను గెలుచుకున్నాయి. కానీ 2014 లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 132 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధిస్తే, కాంగ్రెస్ పార్టీ 77, జేడీఎస్ 15 సెగ్మెంట్లలో ఆధిక్యం కనబరిచాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలతో పోలిస్తే మూడు రెట్లకు పైగా కమలనాథులు పట్టు సాధించారు. 2013లో 20 శాతం ఓట్లు పొందిన బీజేపీ 2014లో 43 శాతం ఓట్లను ఒడిసి పట్టింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం కూడా 2013తో పోలిస్తే 2014లో 37 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్ల ఆధిక్యత స్వల్పంగా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ లబ్ధి పొందింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS