టిడిపి చాలెంజ్ కి విజయసాయిరెడ్డి కౌంటర్, చంద్రబాబు గజ నేరస్తుడు, చార్లెస్ శోభరాజుకు సమానం

Oneindia Telugu 2018-03-27

Views 914

YSR Congress Party MP Vijaya Sai Reddy writes letter to Rajya Sabha secretary general for today footage Videos.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన మాత్రం తాను నమస్కారం పెట్టానని, అందుకు ప్రధాని ప్రతి నమస్కారం చేశారని చెప్పారు.
కేలు లాబీయింగ్ కోసమే విజయసాయి రెడ్డి ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో ఆయన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఈ రోజు (మంగళవారం) రాజ్యసభకు సంబంధించిన వీడియోను విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గజ నేరస్తుడు అని, ఆయన చార్లెస్ శోభరాజుకు సమానం అన్న విజయసాయి రెడ్డిపై ఐటీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఆయన తిరుపతిలో మాట్లాడారు. ఏ2 ముద్దాయి విజయసాయికి మాట్లాడే హక్కు లేదన్నారు. కేసుల మాఫీ కోసమే ఆయన తాపత్రయం అన్నారు. ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని నిలదీస్తున్నదెవరో, కాళ్లు పట్టుకుంటున్నది ఎవరో అందరూ గమనిస్తున్నారని లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి పక్కన ఏ 2 ముద్దాయి తిరగడం మంచిది కాదన్నారు. అఖిల పక్ష భేటీ నిర్వహించాలన్న పార్టీలే డుమ్మా కొట్టాయన్నారు. కేసుల మాఫీ కోసమే వైసీపీ తాపత్రయం అన్నారు.
విజయ సాయి రెడ్డిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గజదొంగలు జగన్, విజయ సాయి రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డే చంద్రబాబును ఏం చేయలేకపోయారని చెప్పారు. విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS