Karate Kalyani Talks About Tollywood Culture

Filmibeat Telugu 2018-03-27

Views 953

Karate Kalyani Counters Rumours . While countering the actresses who came onto roads about tollywood culture , she said they should not have encouraged such things in the incipient stage. She condemned their blaming the industry and said everything depends upon their character and the way they present themselves.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. కమిట్మెంటు ఇస్తేనే అవకాశాలు అనే ఆరోపణలపై ఆమె మాట్లాడుతూ.... టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు, నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే..ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు. కాస్టింగ్ కౌచ్, నన్ను వాడుకున్నారు అని ఆరోపిస్తున్నా వారు.... అలాంటి అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? అని కళ్యాణి ప్రశ్నించారు. మొదటే నేను రాను, నాకు ఇష్టం లేదు, నేను ఆ టైపు కాదు అని చెబితే నిన్ను ఎందుకు అడుగుతారు? నువ్వు ముందు వెళ్లి పూసుకుని, నీ అంతటనువ్వే కాంటాక్ట్స్ పట్టుకుని, ఆ తర్వాత వాళ్లేదో అన్నారని గోల చేయడం ఎందుకు. నీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కళ్యాణి అన్నారు.
ఎవరైతే ఇలాంటి పబ్లిసిటీ చేసుకుంటున్నారో వారు చేసేది పూర్తిగా తప్పు. ఇండస్ట్రీలో బ్రతుకుతూ, ఇండస్ట్రీ తిండి తింటూ, నిన్ను తల్లిలా ఆదరిస్తున్న ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం సరికాదు. ఒక విధంగా ఇది సహించరాని నేరం. ఇలాంటి వారు నాకు ఎదురు పడితే డైరెక్టుగా ఎటాక్ చేస్తాను, ఇండస్ట్రీ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావ్ అంటూ నిలదీస్తాను అని కళ్యాణి చెప్పుకొచ్చారు. మనం ప్రవర్తించే తీరు బట్టే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. నన్నెందుకు వచ్చి అడగరు? నిన్నే ఎందుకు అడుగుతున్నారు? నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ, పద్దతులు, నీ మాటలు బట్టే అవన్నీ ఉంటాయి. అదంతా మనలోనే ఉంటుంది. సినిమాల్లో మనం చేసే క్యారెక్టర్లను బట్టి ఎవరూ మనల్ని డిసైడ్ చేయరు, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయంలో నీకు నువ్వ బాధ్యురాలివి అని కళ్యాణి అభిప్రాయ పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS