No Confidence Motion In Parliament : 'అవిశ్వాసం' నేడే?:.. ఏం జరగబోతోంది?

Oneindia Telugu 2018-03-27

Views 4.3K

No-confidence motions coming up for discussion today? The no-confidence notices submitted by YSRCP and TDP are again expected to be taken up for discussion on Tuesday.

సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో ఇన్నాళ్లు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోయింది. టీఆర్ఎస్, అన్నాడీఎంకె పార్టీల ఆందోళనలే ఇందుకు కారణమన్న వాదనలు వినిపించాయి. తాజాగా టీఆర్ఎస్ అవిశ్వాసానికి సహకరించేందుకు ముందుకు రావడంతో.. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీలతో పాటు కాంగ్రెస్, సీపీఎం, ఆర్‌ఎస్‌పీలు కూడా అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వడంతో.. బీజేపీ ఇరకాటంలో పడ్డట్టయింది. కనీస మద్దతు సంఖ్యాబలంపై క్లారిటీ రావడంతో.. మంగళవారం అవిశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోక తప్పదు. అయితే ఎవరి అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారు? అన్న ప్రశ్నకు.. ముందుగా నోటీసులు ఇచ్చిన వైసీపీ అవిశ్వాసాన్నే లెక్కలోకి తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS