Kathi Mahesh Comments On Needi Naadi Okate Kadha Thanks Meet. Needi Naadi Oke Katha starring Sri Vishnu, Satna titus directed by Venu Udugula.
శ్రీవిష్ణు కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నీదీ నాదీ ఒకే కథ'.ఇటీవల విడుదలైన ఈ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల నుండి కూడా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివాదాస్పద క్రిటిక్ మహేష్ కత్తి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ మధ్య కాలంలో 8 నిమిషాల రివ్యూ ఏ సినిమాకు చెప్పలేదు. ఈ సినిమాకు చెప్పాల్సి వచ్చింది. అన్ని మంచి విషయాలు ఇందులో ఉన్నాయి.తిట్టడానికి రెండు మాటలో మూడు మాటలో వాడతాం.ఒక మంచి సినిమా గురించి మనస్ఫూర్తిగా చెప్పాలంటే చాలా మాటలు వాడాల్సి ఉంటుంది.ఈ సినిమాను ప్యాక్ చేసినటువంటి విధానం బావుంది. ప్రస్తుత జనరేషన్‌కు సంబంధించి కనీసం 10 ఇష్యూలను చాలా లోతుగా, ఘాడంగా విశ్లేషించి, విమర్శించి దానికి ఒక పాజిబుల్ సొల్యూషన్ చూపించిన సినిమా ఇది. అందుకనే చరిత్రలో మిగిలిపోతుంది.... అని మహేష్ కత్తి తెలిపారు.
ఇపుడున్న సమాజంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం ప్రగతిని చూసే విధానం, డబ్బుల్ని కొలిచే విధానం, సక్సెస్‌ను నిర్వచించే విధానం...వీటిలో ఏది తీసుకున్నా ఈ సినిమా ఎక్కడో ఒక దగ్గర ఎగ్జాంపుల్‌గా కోట్ చేయబడుతుంది. వేణు ఊడుగుల ఒక కవి, కవి సినిమా తీయడం అంటే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అనుకునే వాడిని, ఎందుకంటే ఏదేదో లేయర్లు ఆలోచిస్తాడు, ఒక లైన్ రాసి దాంట్లో పది అర్థాలు ఉన్నాయి వెతుక్కోండి అని చెబుతాడు. ఇలాంటి మనిషి సినిమా తీస్తే మోస్ట్ కాంప్లెక్స్ సినిమా అవుతుంది, ఎవరైనా సినిమా చూస్తారా? నేను చూసినా నాకు అర్థమవుతుందా? అనే డౌట్ ఉండేది.... అని మహేష్ కత్తి చెప్పుకొచ్చారు.