Savithri's Biopic Movie Mahanati Shooting Has Been Wrapped Up. Some of the graphics works for the Mahanati movie is still in pending. Once it is completed the team will start the post production works.
సినిమా షూటింగ్ ముగియగానే యూనిట్ సభ్యులంతా పార్టీ చేసుకోవడం సర్వసాధారణం. దాదాపు సంవత్సర కాలం పాటు సాగిన షూటింగ్ ఎట్టకేలకు ముగియడంతో 'మహానటి' టీం కూడి చిన్నపార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలొ దర్శక నిర్మాతలతో పాటు ప్రధాన పాత్రధారి కీర్తి సురేష్ కూడా ఆనందంతో చిందులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.
మహానటి' చిత్రానికి సంబంధించి షూటింగ్ పార్టు మాత్రమే పూర్తయింది. సినిమాకు సంబంధించిన కొంత గ్రాఫిక్ వర్క్ పెండింగులోనే ఉందట. వీలైనంత త్వరగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంవత్సరకాలంగా ఒక అద్భుతమైన ప్రయాణం సాగింది. అది ఈ రోజు ముగిసింది. ఎమోషనల్‌గా నా మనసుకు ఎంతో బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చి దర్శకుడు నాగఅశ్విన్, వైజయంతి మూవీస్ వారికి బిగ్ థాంక్స్. ఈ చిత్రం మేము గర్వపడే సినిమా అవుతుంది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నాను... అని కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.
సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో ‘మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.