Andhra Pradesh Parties Protest, Block Highways

Oneindia Telugu 2018-03-22

Views 92

Political parties in Andhra Pradesh on Thursday held a statewide peaceful protest in the support of party MPs' agitation in the Parliament.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం నాడు ఏపీలో పలు చోట్ల జాతీయ రహదారులపై పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి పార్టీల నిరసన కార్యక్రమాలతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఆందోళన కార్యక్రమానికి బిజెపి మినహ అన్ని పార్టీలు మద్దతును ప్రకటించాయి.
హైవేల దిగ్భంధనం, రహదారులపై నిరసనల కార్యక్రమాల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి నేతలు కూడ పాల్గొన్నారు. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు పోటా పోటీగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఏపీ రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆయా పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు విశాఖలో వామపక్షాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా నందిగామలో విజయవాడ- హైద్రాబాద్ రహదారిని దిగ్భంధించారు. ఏపీ రాష్ట్రం గుండా వెళ్ళే ప్రతి జాతీయ రహదారితో పాటు, రాష్ట్ర రహదారుల్లో కూడ ఆందోళన కారులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలతో ఆయా రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS