#DeleteFacebook : Deletion vs Deactivation, Reasons To Delete Facebook

Oneindia Telugu 2018-03-22

Views 3

#DeleteFacebook is trending across the internet. Facebook is under severe scrutiny because of the way a data firm called Cambridge Analytica has been misusing user data from the social network.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌పై 'డేటా లీక్' ఆరోపణలు వెల్లువెత్తడంతో.. సంస్థ షేర్లు భారీగా పతనమైన సంగతి తెలిసిందే. వేలకొద్ది ఖాతాల నుంచి వ్యక్తిగత డేటా లీకైనట్టు ఆరోపణలు వస్తుండటంతో.. ఫేస్‌బుక్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజెన్స్ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో #డిలీట్‌ఫేస్‌బుక్‌ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.
డేటా లీక్ అనుమానాలతో.. ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించుకోవడానికి సిద్దపడుతున్నవారు.. ఖాతాను ఎలా తొలగించుకోవాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డీ-యాక్టివేషన్, డిలీషన్ అనే రెండు ఆప్షన్స్ లో ఏది ఎంపిక చేసుకోవాలనే దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నారు.
డీ-యాక్టివేషన్ అనేది ఫేస్‌బుక్ ఖాతాను తాత్కాలికంగా కనిపించకుండా చేసే ప్రక్రియ మాత్రమే. ఈ ఆప్షన్ ద్వారా కొంత కాలం వరకే ఫేస్‌బుక్ ఖాతాను ఎవరికీ కనిపించకుండా చేయవచ్చు. ఆ వ్యవధిలో అది ఉనికిలో(యాక్టివ్) లేకుండా పోతుందన్నమాట. ఆ తర్వాత తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది
'డిలీషన్' ఆప్షన్ కు ఫేస్‌బుక్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే.. 'డిలీషన్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత.. 90రోజుల వరకు ఆ ప్రక్రియ నడుస్తుంది. అంటే, ఫేస్‌బుక్ యూజర్ ఖాతాలోని సమాచారం, ఫోటోలు, పోస్టులు, ఇతరత్రా అన్నీ డిలీట్ చేయడానికి ఇంత సమయం పడుతుంది. ఆ సమయంలో ఇతరులకు మీ ఫేస్‌బుక్ ఖాతా కనిపించదు.
నిజానికి డిలీట్ కన్నా డీ-యాక్టివేట్ చాలా సులువైన ప్రక్రియ అయినప్పటికీ.. దీని ద్వారా ఫేస్‌బుక్ ఖాతాలోని పూర్తి సమాచారం తొలగించబడదు. కేవలం ఫేస్‌బుక్ లో కొన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. మళ్లీ యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు.. యూజర్ ఐడీ , పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి క్షణాల్లో రీయాక్టివేట్ చేసుకోవచ్చు.

Share This Video


Download

  
Report form