Former MP Vundavalli Arunkumar made allegations on Ap chief minister Chandrababunaidu on Wednesday over polavaram.
ప్రధానమంత్రి మోడీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మిత్రుత్వం ఉందో, శత్రుత్వం ఉందో చెప్పాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతోందనే విషయాలను త్వరలోనే బయటపెట్టనున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. బుధవారం నాడు ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పోలవరం ప్రాజెక్టుపై గతంలో తాను వ్యక్తం చేసిన అనుమానాలే నిజమయ్యాయని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుది లాలూచీకి పాల్పడుతున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును ప్రకటిస్తే ఆ పనులను రాష్ట్రం ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.తక్కువ ధరకే నవయుగ కంపెనీకి పనులు అప్పగించారని చంద్రబాబునాయుడు చెప్పారని, కానీ, ఈ పనులను కేంద్ర మంత్రి గడ్కరీ అప్పగించారని అంటున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు సరికావని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. జెఎఫ్‌సి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై కూడ చర్చించామని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన విషయాలపై సమాధానం చెప్పకుండా ఆయనపై టిడిపి నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు.