TDP leaders Narayana and peetala Sujatha and Ayyannapatrudu on Thursday fired at Janasena president Pawan Kalyan.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. హోదా కోసం పోరాడుతున్న తమ పార్టీపై పవన్‌కళ్యాణ్ రాళ్లు వేయడం ఎవరికి మేలు చేయడానికని తెలుగుదేశంపార్టీ నిలదీసింది.
చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పవన్‌పై ఎమ్మెల్యే అనిత పండిపడ్డారు. పవన్‌ను వెనకుండి ఎవరో నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. గుంటూరు సభలో పవన్‌కు ఒక్కరాత్రిలోనే జ్ఞానోదయం అయినట్లు మాట్లాడారని అన్నారు. కేంద్రం చేతుల్లో పవన్ కీలు బొమ్మగా మారారని, ఆయన ఒకసారి పునరాలోచించుకోవాలని సూచించారు.
కాగా, టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత.. వపన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు పవన్ క్షమాపణ చెప్పాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తా అంటున్న పవన్ ముందు అన్న(చిరంజీవి)ను ప్రశ్నించాలన్నారు. ఎంతో మంది నాయకులను చిరంజీవి మోసం చేశారని అన్నారు. రాజ్యసభలో పోరాటం చేయనందుకు చిరంజీవిని ప్రశ్నించాలని సూచించారు. పవన్‌కు రాజకీయ కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. మరో నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మోడీ ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదివారని అన్నారు. చంద్రబాబుపై ఆరోపణలతో పవన్‌కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విభజన చట్టాన్ని అమలు చేయాలనే బీజేపీతో నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. టీడీపీని అవినీతి పార్టీ అంటారా? అని పవన్ కళ్యాణ్‌పై నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో నెం.1గా ఉన్న ఏపీని 13వ స్థానానికి తీసుకొచ్చామని తెలిపారు. పవన్‌కు ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు.