Rohit Sharma Breaks Yuvraj Singh Six Records

Oneindia Telugu 2018-03-15

Views 60

Rohit Sharma on his way to the record with the fifth six of his innings against Bangladesh, Yuvraj Singh’s tally of 74. Others players featuring on the list are – Suresh Raina (54 sixes), MS Dhoni (46) and Virat Kohli (41).

పేలవ ప్రదర్శన అని విమర్శిస్తున్న తరుణంలో రోహిత్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి అందరి నోళ్లు మూయించాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ విరామంలో ఉండగా తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ ఈ ముక్కోణపు టోర్నీ తొలి మ్యాచ్ నుంచి ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతని స్థానం మిడిలార్డర్‌కు మార్చే ఆలోచనలో పడ్డాయి మేనేజ్‌మెంట్ వర్గాలు.
కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ట్రైసిరీస్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాతో భారత జట్టు తలపడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 61 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజృంభించిన రోహిత్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (74) బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
బుధవారం టీ20లో 5 సిక్సులు కొట్టడంతో రోహిత్ ఖాతాలో సిక్సర్ల సంఖ్య 75 చేరింది. ఇక టీమిండియా తరఫున సురేశ్ రైనా(54), మహేంద్రసింగ్ ధోనీ(46), విరాట్ కోహ్లీ 41 సిక్సుల తో అత్యధిక సిక్సులు బాదిన వారిలో తరువాతి స్థానాల్లో ఉన్నారు.

Share This Video


Download

  
Report form