రంగస్థలం చిత్రంలో రాజకీయ అంశాలు : 2019 టార్గెట్ నా ?

Filmibeat Telugu 2018-03-14

Views 509

Interesting details on Rangasthalm story. Interesting news going on about Aadi role. may be this film also focusing elections

విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రంగస్థలం చిత్రంపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాంచరణ్ ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో లాంతర్ గుర్తుకు ఓటేయండి అంటూ హీరో ఆదిపినిశెట్టి లుక్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆది ఈ చిత్రంలో రాంచరణ్ కు సోదరుడిగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశమే ఉత్కంఠతో అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు.
సుకుమార్ ఈ చిత్రాన్ని 1985 పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో ఉన్న పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లుగా సెట్లు వేసి చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. సినిమా చూసినంత సేపు 1985 కాలంలోకి వెళ్లిన అనుభూతి అభిమానులకు కలగనునట్లు ఇన్ సైడ్ టాక్.
రంగస్థలం చిత్రంలో రాజకీయ అంశాలు ఉన్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ క్లూ ఇచ్చింది. చిట్టి బాబు సోదరుడు ఎన్నికలో పోటీ చేస్తుంటే అతడికి కచ్చితంగా ప్రత్యర్థి ఉంటాడు.ఆ ప్రత్యర్థి ఎవరు, వారి నుంచి వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు తన సోదరుడిని గెలిపించడం సాధ్యమేనా ? గెలిపించాడా లేదా ? వంటి ప్రశ్నలని సుకుమార్ అభిమానులకు వదలిపెట్టి సస్పెన్స్ లోకి నెట్టాడు. సుకుమార్ రేకెత్తించిన సస్పెన్స్ వీడాలంటే మార్చ్ 30 న రంగస్థలం చిత్రం చూడవలసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో ఆడియో వేడుకకు సిద్ధం అవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS