MLA's daughter married Masti Gudi producer, Duniya Vijay supports

Oneindia Telugu 2018-03-09

Views 507

Kannada actor Duniya Vijay supports MLA's daughter Lakshmi Nayak and Film producer Sundar Gowda marriage. He gave shelter to the newly married couple in his House. and today he bring them to Yelhanka police station to record their statements.
నిశ్చితార్థం జరిగిన తరువాత కన్నడ సినీ నిర్మాతతో లేచిపోయి రహస్యంగా వివాహం చేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివమూర్తి నాయక్ కుమార్తె లక్ష్మి నాయక్ బెంగళూరులోని యలహంక న్యూ టౌన్ పోలీసుల ముందు ప్రత్యక్షం అయ్యారు. హీరో విజయ్ ఎంట్రీతో నవదంపతులు పోలీసుల ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ దెబ్బకు నమోదు అయిన మిస్సింగ్ కేసు రివర్స్ అయ్యింది.

గురువారం మైసూరు నగరం సమీపంలోని చాముండేశ్వేరి దేవాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్న లక్ష్మి నాయక్, కన్నడ మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడ మైసూర్ నుంచి ఎవ్వరికంట పడకుండా అక్కడి నుంచి జంప్ అయ్యారు. నవదంపతులు హనీమూన్ వెలుతారని అందరూ అనుకున్నారు. అయితే వారి అంచనాలను తారుమారు చేస్తూ బెంగళూరు నగరం చేరుకున్నారు.

గురువారం రాత్రి బెంగళూరులోని హీరో దునియా విజయ్ ఇంటికి నవదంపతులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం హీరో దునియా విజయ్ నవదంపతుల ను పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు.

సుందర్ పి. గౌడను తాను ప్రేమించి తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నానని, ఈ విషయంలో ఎవ్వరూ తనను బలవంతం చెయ్యలేదని ఎమ్మెల్యే కుమార్తె లక్ష్మి నాయక్ యలహంక న్యూ టౌన్ పోలీసు అధికారులకు చెప్పారు.

Share This Video


Download

  
Report form