Pawan Kalyan Shocking Comments..

Oneindia Telugu 2018-03-07

Views 606

Jana sena chief Pawan Kalyan on Wednesday said that government sent IT officers to his home.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కేసులకు భయపడుతున్నారని మండిపడ్డారు.

థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారని .. థర్డ్ ఫ్రంట్ అని తాము చెబుతోంది అధికారం కోసం కాదని, రాజకీయాల్లో మార్పు కోసమని ..

స్వతంత్రంగా వ్యవహరించడానికి థర్డ్ ఫ్రంట్ అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. థర్డ్ ఫ్రంట్‌లో దక్షిణాది నుంచి కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే పార్టీలు ముందుకు రావాలని అభిప్రాయపడ్డారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ మేవాని వంటి వారు కూడా కలిసి వస్తారన్నారు.

తనపైకి ఐటీ అధికారులను కూడా పంపించారని బాంబు పేల్చారు. ప్రత్యేక హోదాపై బాధ్యతతో వ్యవహరించాల్సిన పార్టీలు ఇలా చిల్లరగా ప్రవర్తిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందని .. ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమిస్తున్నాయన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS