Third Front : Eye on 2019 Polls, OPINION కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!

Oneindia Telugu 2018-03-05

Views 1.6K

So many People Says that With an eye on the 2019 general elections, Telangana Chief Minister K Chandrashekhar Rao is openly exploring the possibilities of a new front without BJP and Congress.
బీజేపీ, కాంగ్రెస్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మార్పు తీసుకురావడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయని, కాబట్టి కొత్త ఫ్రంట్ ఆవశ్యకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటి? నిజంగానే ఆ ఫ్రంట్ సాధ్యమా? గత అనుభవాల దృష్ట్యా ప్రంట్ ఎన్నాళ్లు మనగలుగుతుంది? అందులో ఎవరెవరు ఉంటారు? నిజంగా దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇతర ప్రజా సంబంధ కారణాలతోనే మోడీపై గొంతు పెంచుతున్నారా? లేక కేసుల భయంతోనా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి వారు దక్షిణాది గురించి మాట్లాడుతున్నారు. కమల్ పార్టీ గుర్తులోనే దక్షిణాది రాష్ట్రాలకు చోటు కల్పించారు. పవన్ నోట దక్షిణాది నిర్లక్ష్యం అనే మాట పలుమార్లు విన్నాం. కేంద్రం తీరుపై టీడీపీ ఇటీవల గుర్రుగా ఉంది. చంద్రబాబు కూడా మోడీపై గొంతు పెంచారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఘాటైన విమర్శలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా టీడీపీ, ఇప్పుడు టీఆర్ఎస్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫ్రంట్ దక్షిణాది ప్రాధాన్యంగా ఉంటుందా? లేక దేశవ్యాప్తంగా బీజేపీ విజయదుందుభిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి ముందుకు సాగుతారా అనే చర్చ సాగుతోంది. మిగతా వారు దక్షిణాది గురించి మాట్లాడితే, కేసీఆర్ వ్యాఖ్యలు మాత్రం దేశవ్యాప్తంగా అనేలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ఆయా రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో తమకు చెక్ పెట్టవద్దనే భయంతో కేసీఆర్.. మోడీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ చెబుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS