బిగ్ బాస్ రియాలిటీ షో సెలబ్రిటీ సునామి కిట్టి, అతని అనుచరులు అరెస్టు కావడంతో తన అక్రమ సంబంధం విషయం బయటపడిందనే అవమానంతో కిడ్నాప్ కేసులో కీలకసూత్రదారి అయిన సునీల్ భార్య దీపా విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది.
కిడ్నాప్, అక్రమ మారణాయుధాల కేసులో కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో సెలబ్రిటీ సునామి కిట్టితో సహ అతని అనుచరులు శనివారం అరెస్టు అయ్యారని పదేపదే వార్తలు ప్రాసరం అయ్యాయి. కిడ్నాప్ కు కారణం సునామి కిట్టి స్నేహితుడి భార్య దీపా అని పోలీసులు చెప్పిన విషయం టీవీ చానల్స్ లో ప్రాసారం చేశారు.
సునామి కిట్టితో సహ అతని స్నేహితుడు సునీల్, కిడ్నాప్ అయిన సునీల్ భార్య దీపా ప్రియుడు తౌసిక్ ఫోటోలు కూడా టీవీ చానల్స్ లో చూపించారు. తన భర్త ఫోటో టీవీల్లో రావడం, కిడ్నాప్ కు కారణం తానే అని చెప్పిన విషయం దీపా చూసింది.
బెంగళూరులోని రామమూర్తి నగరలో నివాసం ఉంటున్న దీపా శనివారం ఇంటిలో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు దీపాను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీపాకు చికిత్స చేశామని, ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.
సునీల్ భార్య దీపా ప్రియుడిని ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కిడ్నాప్ చేసిన సునామి కిట్టి అండ్ కో అతన్ని హోరమావు సమీపంలోని ఫాం హౌస్ లో నిర్బంధించి చితకబాది కత్తితో దాడి చేసి రివాల్వర్ తో చంపేస్తాయని బెదిరించారు.