J.C.Diwakar Reddy Says If YSRCP MP Resign, I will Resign

Oneindia Telugu 2018-03-02

Views 189

Tdp MP Jc Diwakar Reddy challenged to Ysrcp on Friday at Amaravathi. Jc Diwakar Reddy said that If one Ysrcp MP resign to MP post, I will resign to MP post.

కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావాలని ప్రజలు కోరుకొంటున్నారని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.తాము ప్రభుత్వం నుండి బయటకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పడిపోదన్నారు.మార్చి 5వ తేది నుండి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపీలతో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి హజరయ్యేందుకు ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అమరావతికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని...ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సహనం ఎంతో కాలం ఉండదని. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తోందని..రాష్ట్రానికి విభజన చట్టం ఇచ్చిన హమీలను అమలు చేయాలని..ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలుచుకొంటే ఏమైనా జరుగుతోందని . ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేలా వెంకయ్యనాయుడు చొరవ తీసుకొంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని .. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని జెసి తేల్చి చెప్పారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాల విషయమై టిడిపి ఎంపీలతో చర్చించినా పెద్దగా రాష్ట్రానికి ఉపయోగం ఉండదని...కేంద్రానికి ఈ దఫా తలొగ్గేది లేదని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని వైసీపీ ప్రకటన ప్రజలను మభ్య పెట్టడానికేనని ..జగన్‌ ఓ ఎంపీతో రాజీనామా చేయించమనండి..తానూ రాజీనామా చేస్తానని..చివరకు ఎవరు గెలుస్తారో చూద్దామని జేసీ సవాల్ విసిరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS