A Telangana police officer is earning some well-deserved praise on social media for his timely help to a group of stranded school students.
'ఒక్క నిమిషం' నిబంధన విద్యార్థులకు పెద్ద సవాల్‌గా మారింది. పరీక్ష సమయం కంటే ముందుగానే బయలుదేరినా.. మధ్యలో అనుకోని ఆటంకాలు తలెత్తితే వారి పరిస్థితి అగమ్యగోచరమే
హైదరాబాద్ లోని ఓ స్కూలు విద్యార్థులు కూడా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు. అయితే ఆపద్భాంధవుడిలా ఓ పోలీస్ ఆఫీసర్ వారిని ఆదుకోవడంతో.. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో ఆ అధికారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
బుధవారం ఉదయం మహేంద్ర హిల్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి 40మంది విద్యార్థులతో కూడిన బస్సు బయలుదేరింది. విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించే క్రమంలో.. సికింద్రాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఆ బస్సు అర్థాంతరంగా ఆగిపోయింది. టైర్ పంక్చర్ అవడంతో ఇక ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
బస్సు మధ్యలోనే నిలిచిపోవడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వెంట వచ్చిన వార్డెన్ ఆటోల ద్వారా వారిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. అందరిని తరలించగా.. మరో 8మంది విద్యార్థులు మాత్రం అక్కడే మిగిలిపోయారు. మరోవైపు సమయం ముంచుకొస్తుండటంతో వారిలో ఆందోళన పెరిగింది.
విద్యార్థులు వాహనాల కోసం నిరీక్షిస్తూ రోడ్డుపై వేచియున్న సమయంలో.. అటుగా వచ్చిన మారేడ్ పల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు వారిని చూసి పోలీస్ వెహికల్ ఆపాడు. ఆ ఎనిమిది మంది విద్యార్థులను తమ వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రాలకు చేర్చారు.