వెంకయ్య, గవర్నర్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం

Oneindia Telugu 2018-03-01

Views 471

Film actor Shivaji made conroversial comments on Governer Narasimhan and vice pesident M Venkaiah Naidu.

గవర్నర్ నరసింహన్‌పై సినీ హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం గవర్నర్ నరసింహన్ అని ఆయన అన్నారు. గురువారం గుంటూరులో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మనకన్నా మందు రాష్ట్రానికి చెందిన 25 మంది పార్లమెంటు సభ్యులు పోరాటం చేయాలని, ఎంపీలు తమ స్వార్థం కోసం నాటకాలు ఆడుతున్నారని శివాజీ అన్నారు పార్లమెంటు జరగకుండా చేస్తే సగం విజయం సాధించినట్లేనని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి అయ్యారని హీరో శివాజీ అన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఏమడిగినా వెంకయ్య నాయడికి కోపం వస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రత్యేక హోదా లేకపోతే ఏమీ చేయలేదని శివాజీ అన్నారు. నాటకాలు అపి ప్రత్యేక హోదా సాధన కోసం పార్టీలు కలిసి రావాలని ఆయన అన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బిజెపి వెంట్రుకతో సమానంగా పోలుస్తోందని శివాజీ మండిపడ్డారు ఈ సదస్సులో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కార్యదర్శి మధు, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని కాంగ్రెసు సీనియర్ నేత కుంతియా అన్నారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపి కోసం చేసిన చట్టాలను ఎన్డీఎ ప్రభుత్వం అమలు చేయకపోడం దురదృష్టకరమని అన్నారు. అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నా ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS