Chandrababu naidu recalls his previous plan in elections

Oneindia Telugu 2018-03-01

Views 3

chandrababu naidu first time elected as MLA in 1978 from Chandragiri Assembly segment.Pakala samiti key leaders supported to Chandrababu Naidu in this elections.

1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో జనతాపార్టీకి గట్టి పట్టున్నప్పటికీ చంద్రబాబునాయుడు విజయం సాధించారు. ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహం కలిసొచ్చిందని బాబు గుర్తు చేసుకొన్నారు.
1978 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు. ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి దిగారు. అప్పటికి ఆయన ఎస్వీ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌. తన మిత్రులు, సహ విద్యార్థులు వంద మందితో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు. వారంతా చంద్రగిరి నియోజకవర్గంలో ఊరూరుకూ తిరిగారు. ప్రతి ఇల్లు తిరిగి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.ఈ నియోజకవర్గంలో జనతా పార్టీకి గట్టి పట్టున్నా బాబు వ్యూహం ఫలించింది పోటీ చేసిన తొలిసారే బాబు విజయం సాధించారు. జనతా పార్టీ అభ్యర్థి కొంగర పట్టాభి చౌదరిని ఓడించి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
1978లో కార్లు అద్దెకు దొరకడం తక్కువగా ఉండేదని బాబు గుర్తు చేసుకొన్నారు. ఒకటి రెండు కార్లు అద్దెకు దొరికితే ఆ కారు నిండా కూర్చొని ప్రచారానికి వెళ్ళేవాళ్ళమని చంద్రబాబు చెప్పారు. మోటార్ బైక్‌లపై ప్రచారం చేసేవారుబుల్లెట్‌పై తనతో పాటు మరో ఇద్దరిని తీసుకొని ప్రచారం నిర్వహించినట్టుగా చంద్రబాబునాయుడు చెప్పారు. మరోవైపు యెజ్డీ బైక్‌ను బాబు ఉపయోగించేవారు.
చంద్రబాబునాయుడు గెలుపులో పాకాల సమితి కీలకంగా పనిచేసింది. పాకాల సమితిలో మెజారిటీ ఓట్లు చంద్రబాబునాయుడుకు రావడంతో జనతా పార్టీ అభ్యర్థి పట్టాబిపై బాబు విజయం సాధించారు. . పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే ఆ సమితిలో పట్టున్న స్థానిక నేత వద్దకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని చంద్రబాబు కోరారు. ఏ కారణం చేత మద్దతివ్వాలనే విషయమై బాబు వివరించారు. అయితే బాబుకు మద్దతిచ్చేందుకు ఆ నాయకుడు ముందుకు వచ్చారు. బాబు గెలుపులో పాకాల సమితి కీలకంగా పనిచేసింది.

Share This Video


Download

  
Report form