TDP Ready To File Case On Ys Jagan And Vijaya Sai Reddy

Oneindia Telugu 2018-02-23

Views 144

Telugu Desam Party MLA Bonda Umamaheswara Rao on Friday fired at YSRCP leader Vijaya Sai Reddy and Bharatiya Janata Party leaders.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు శుక్రవారం మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు హయాంలో అధికారులు జాతీయ అవార్డులు గెలుచుకున్నారని చెప్పారు. ఐఏఎస్‌లపై విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారన్న ఆరోపణలపై బోండా ఉమ స్పందించారు. ప్రత్యేక హోదా వద్దు అని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన వాటినే తాము అడుగుతున్నామని చెప్పారు.
జగన్‌, విజయ సాయి రెడ్డిలపై ఉన్న కేసుల విచారణ వేగం అవుతున్నందునే వారు అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడులు ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించే అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతినేలా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్, విజయ సాయి రెడ్డిల పైన కేసు నమోదుకు కూడా ప్రభుత్వం వెనుకాడదని మంత్రులు హెచ్చరించారు. సీఎంవో అధికారులు, నిఘా విభాగం అధికారులపై విజయ సాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS