Andhra Cabinet Meeting : Takes Key Decisions

Oneindia Telugu 2018-02-22

Views 2

A cabinet meeting of the Government of Andhra Pradesh was held in Amaravati on Wednesday. During the meeting, the Cabinet approved the following decisions: Dearness Allowance (DA) for state government employees has been increased from 22 percent to 24 percent. Village Revenue Assistants will be paid Rs. 300 extra per month.

అమరావతి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, అనేక కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ మీటింగ్ అనగానే తాజా పరిస్థితులకు సంబంధించి కూడా చర్చ జరుగుతుందని, తదనుగుణంగా నిర్ణయాలు...ప్రకటనలు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.అయితే కారణాలేమైనా కానీ రాష్ట్రాన్ని ఇంతగా కుదిపేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అంత ముఖ్యమైన మంత్రిమండలి సమావేశంలో చర్చ కాదు కదా!...కనీసం ప్రస్తావన కూడా లేదు... తాజా రాజకీయ పరిస్థితులు ఏమాత్రం పట్టనట్లు...అంతా...మామూలు గానే ఉన్నట్లు...అసలేమీ జరగనట్లు ఎప్పటిలాగానే మూసలో మీటింగ్ కానిచ్చేసిన ఎపి కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రజలను ఉసూరుమనిపించింది. ఇంత కీలక తరుణంలో జరుగుతున్న అంతటి ప్రాముఖ్యమైన సమావేశంలో ముఖ్యమంత్రి కాని, మంత్రి వర్గ సహచరులు కానీ...కనీసం ఆ ఊసు కూడా ఎత్తకపోవడానికి కారణం ఏమిటి?...ఆ కారణం ప్రజలకు సంబంధించిందా? లేక పార్టీ ప్రయోజనాలకు సంబంధించిందా?...ఏమైతేనే ప్రజల మనోభావాలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదన్న సంకేతాలను ఈ సమావేశం చాలా స్పష్టంగా ఇచ్చేసింది.
బుధవారం సచివాలయంలో సిఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఎపి కేబినెట్ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులకు 2017 నుంచి 2108 మార్చి 31 వరకు 2.096 శాతం డిఎ చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విషయంపై కూడా చర్చించారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం, మార్చి 8న బడ్జెట్ ప్రవేశపెట్టాలని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. అయితే కేబినెట్ దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంది.పోలవరం ప్రాజెక్టులో కాంక్రీట్ పనులు చేపట్టిన సవయుగ సంస్థకు రూ.1244 కోట్ల పరిపాలన అనుమతులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎసిబిలో 350 పోస్టులు, గన్నవరం కోర్టులో 25 పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS