Keerthy Suresh Shocking Behaviour On Movie Sets

Filmibeat Telugu 2018-02-21

Views 965

Keerthy Suresh shocking behaviour on movie sets.news goes viral in kollywood movie circles.

బొద్దు గుమ్మ కీర్తి సురేష్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. చూడగానే ఆకట్టుకునే రూపం ఆమె సొంతం. నటన పరంగా కూడా కీర్తి సురేష్ శభాష్ అనిపించుకుంది. అందాల హద్దులు దాటని ఈ భామకు భారీ అభిమానులు ఉన్నారు. హీరోయిన్ల గురించి మీడియాలో తరచుగా కొన్ని వార్తలు, పుకార్లు వస్తుంటాయి.
అదికూడా కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ విషయంలో ఊహించని వార్తలు వస్తే నమ్మడం చాలా కష్టం. కీర్తి సురేష్ గురించి కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఓ వార్త షాక్ కి గురిచేస్తోంది. సెట్స్ లో ఆమె బిహేవియర్ ఇందుకు కారణం అని అంటున్నారు.
కీర్తి సురేష్ నటించిన తొలి చిత్రం నేను శైలజ. తొలి చూపులోనే తెలుగు ఆడియన్స్ ఈమెకు ఫిదా అయిపోయారు. చూడముచ్చటైన ఆమె చిరునవ్వు, అమాయకత్వంతో కూడుకున్న నటన అందరిని ఆకట్టుకున్నాయి.
కీర్తి సురేష్ ఆ తరువాత నాని సరసన నేను లోకల్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో ఈ బొద్దు గుమ్మ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
అజ్ఞాతవాసి చిత్రంతో పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కానీ అజ్ఞాతవాసి చిత్ర ఫలితంతో కీర్తికి నిరాశే మిగిలింది. అయినా కూడా ఇప్పటికి కీర్తి సురేష్ క్రేజీ హీరోయినే. సావిత్రి బయోపిక్ మహానటి వంటి బిగ్ ప్రాజెక్ట్ కీర్తి చేతుల్లో ఉంది.
ఈ బొద్దు గుమ్మ క్యారక్టర్ మీద ఎలాంటి రిమార్క్స్ టాలీవుడ్ లో వినిపించలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం కీర్తి సురేష్ సీనియర్ నటుల సహనానికి పరీక్ష పెడుతున్నట్లు సమాచారం. కీర్తి కోసం దర్శకుడి నుంచి సీనియర్ నటుల వరకు అంతా పడిగాపులు కాస్తున్నా కీర్తి మాత్రం ఆలస్యంగా క్యార్ వాన్ దిగుతుందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS