The way Pawan Kalyan started his Janasena in Hyderabad’s Novotel was like a lion’s roar but now in the name of pleasing various sections it looks like he’s slowly becoming a Chiranjeevi, posted by rgv
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎప్పటికప్పుడు తనకు ఇష్టం వచ్చిన విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిజ నిర్ధారణ కమిటీ వేసి చర్చలు జరుపుతున్న పవన్ కల్యాణ్‌పై ఆయన తాజాగా వ్యంగ్యాస్త్రం విసిరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.
హైదరాబాదు నోవాటెల్‌లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్ కల్యాణ్ సింహంలా గర్జించాడనిపించిందని, కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... అతనూ (పవన్ కల్యాణ్) క్రమంగా చిరంజీవిలా మారిపోతున్నాడే అనిపిస్తుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ (జెఎఫ్‌సి) సమావేశంలో లోకసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన శనివారం మీడియా వద్ద జెపి వ్యాఖ్యలపై స్పందించారు.
ఓ ప్రత్యేక ప్రాజెక్టు లేదా పథకానికి కేంద్రం నిధులు కేటాయిస్తే ఆ నిధులకు సంబంధించిన లెక్కలను కేంద్రం అడగకూడదని జెపి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ జెపి వ్యాఖ్యలతో తాను ఏకీభవించబోనని, నిధులు కేటాయించినప్పుడు వాటిని దేనికి ఖర్చు చేశారో అడిగే హక్కు కేంద్రానికి ఉంటుందని, ఆ విషయాన్ని కూడా జెఎఫ్‌సి విధివిధానాల్లో చేరిస్తే అర్థవంతంగా ఉంటుందని ఐవిఆర్ కృష్ణారావు అన్నారు
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని, ఆ హామీలు తెలంగాణ రాష్ట్రానికి వర్తించవా అని కాంగ్రెసు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఎపి, తెలంగాణ రెండూ తనకు సమానమేనని అంటున్న పవన్ కల్యాణ్ తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు.