BJP MP Haribabu Press Meet On AP Projects With Statistics

Oneindia Telugu 2018-02-10

Views 2

BJP MP Haribabu given clarification on Andhrapradesh projects with statistics. Haribabu said still we are committedly working for AP promises

విభజన చట్టంలోని హామిలను అమలుపరచడంలో కేంద్రం ఏపీని వంచించిందన్న ఆరోపణలకు బీజేపీ ఎంపీ హరిబాబు లెక్కలతో సహా అన్ని వివరాలు బయటపెట్టారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం.. ఏ రాష్ట్రానికి చేయని రీతిలో మోడీ ప్రభుత్వం ఏపీ ప్రయోజనాల కోసం నిధులు కేటాయించిందన్నారు. విభజన హామిలన్నింటిని చిత్తశుద్దితో అమలు చేస్తున్నామని, ఇప్పటికీ ఆ హామిలకు తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ హరిబాబు, బీజేపీ అధికార ప్రతినిధి నరసింహారావు స్పష్టం చేశారు. ఏపీకి మోడీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంపై ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు హరిబాబు.
రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. 10 నెలల రెవెన్యూ లోటును త్వరలో భర్తీ చేస్తారు. రవాణా రంగంలో 3700కి.మీ రహదారుల కోసం లక్ష కోట్లు కేటాయించాం. ఏపీకి 6.8 లక్షల ఇళ్లను మోడీ ప్రభుత్వం కేటాయించింది. ఉజ్వల్‌ వంటి కేంద్ర పథకాలను ఏపీ సమర్థంగా వినియోగించుకుంటోంది.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అని ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు కేంద్రం ఇప్పటికే చెల్లించింది. నాబార్డ్ కూడా ఆర్థిక సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. విభజన చట్టంలో పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణకు కేటాయించి కాంగ్రెస్ అన్యాయం చేసింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా సరే, ఆ ముంపు గ్రామాలను ఏపీలో కలిపి పోలవరం నిర్మాణానికి మార్గం సుగమం చేశాం. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పోలవరంపై మా చిత్తశుద్దికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది?..
పార్లమెంటులో ఆందోళనల సందర్భంగా.. కేంద్రం అందించబోయే సహాయంపై స్పష్టత లేదని టీడీపీ ఎంపీలు ఆందోళన చేశారు. అందులో రెవెన్యూ లోటు ఒకటి. ఐదు సంవత్సరాలకు సంబంధించిన రెవెన్యూ లోటు దాదాపు 20వేల కోట్లు వస్తుందని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఆర్థిక సంఘం సిఫారసుకు అనుగుణంగా 4వేల కోట్లు ఇప్పటికే కేంద్రం మంజూరు. ఇచ్చింది. ఇంకా ఎంత ఇవ్వాలనే దానిపై ఒక అంగీకారం కోసం ప్రయత్నం జరుగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6వేల కోట్లు లోటు ఉంటుందని ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. పరస్పర అంగీకారంతో రెవెన్యూ లోటు చెల్లిస్తాం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS