A Pakistani militant detainee belonging to Lashkar-e-Taiba escaped after gunmen shot two of the three policemen who were accompanying him to Srinagar’s government-run Sri Maharaja Hari Singh Hospital (SMHS) for medical check-up on Tuesday.
పాకిస్తాన్ ఉగ్రవాదులు పేట్రెగిపోయారు. మంగళవారం శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రి ఆవరణలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ అబు హంజుల్లా అలియాస్ నవీద్‌ను చికిత్స నిమిత్తం భద్రతా బలగాలు ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. ముందుగానే ఆసుపత్రి సమీపంలో మాటు వేసిన ఉగ్రవాదులు.. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఖైదీ నవీద్ భద్రతా బలగాల చెర నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఉగ్రవాదులు కూడా పారిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో ఓ పోలీసు మృతిచెందారు.