Delhi Photographer Lost Life By Lover's Family Emerges, CCTV Visuals

Oneindia Telugu 2018-02-05

Views 354

CCTV Visuals from the spot where a 23-year-old photographer was stabbed to lost life by the family of his alleged lover last week in Delhi has now viral.

తన కుమార్తె ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని గ్రహించిన ఓ కుటుంబం.. పరువు కోసం ఆమె ప్రేమిస్తోన్న యువకుడిని గొంతు కోసి హతమార్చిన ఉదంతం దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగుచూసింది. పశ్చిమ ఢిల్లీలోని రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి(20)ని ఫోటోగ్రాఫరుగా పనిచేస్తున్న అంకిత్ సక్సేనా(23) అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. గత మూడేళ్లుగా వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
అయితే యువతి కుటుంబం మాత్రం వారి ప్రేమను అంగీకరించలేదు. మొదట తన కుమార్తెను ప్రేమిస్తోన్న అంకిత్‌ను యువతి కుటుంబ సభ్యలు హెచ్చరించారు. ఇక లాభం లేదని, నలుగురికి తెలిసి తమ పరువు పోతోందని, ఏదో ఒకటి చేయాలని యువతి కుటుంబం నిశ్చయించుకుంది. గురువారం రాత్రి అంకిత్‌ను పిలిచి మళ్లీ యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే.. ఆగ్రహం పట్టలేక యువతి తల్లిదండ్రులు, తమ్ముడు, మామ కలిసి అంకిత్‌పై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. ఆ యువతి మామ కత్తితో అతడి గొంతు కోసేశాడు. జరుగుతున్న గొడవను గమనించి అడ్డుకోబోయిన అంకిత్ తల్లిని ఆ యువతి తల్లి, ఆమె కుమారుడు అడ్డుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ యువతి అమ్మానాన్నలు, తమ్ముడు, మామపై కేసు నమోదు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS