Nara Lokesh addressing the gathering at NRI TDP meeting. Live from Atlanta, USTOUR
అమెరికా వచ్చిన వారు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోయి ఉంటారని తాను భావించానని, కానీ ఇక్కడికి వచ్చిన వారు అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారని, భారత్ ఉన్న వారికే వాటి విలువ తెలియడం లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. కూచిపూడి నృత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌లో కూచిపూడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీనికి సిలికాన్ ఆంధ్రా సహకరించాలని లోకేశ్ కోరారు.
రాష్ట్రంలోని ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఉపయోగించుకుని కొన్ని గ్రామాల్లో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పైలట్ ప్రాజెక్టును అమలుచేసేందుకు 'ఫస్ట్ అమెరికన్' కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలో లోకేశ్ పర్యటించారు. పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తన పర్యటనలో భాగంగా లోకేశ్ 'ఫస్ట్ అమెరికన్' పైనాన్షియల్ కార్పొరేషన్ కంపెనీ సీఈవో డెన్నిస్ జె గిల్‌మోరె, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కెన్నెత్ డి డిజియోర్జియో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ ఇ సీటన్‌లతో సమావేశమయ్యారు.