Minister Harish Rao Speech At Peddamandadi Canal Foundation Stone Ceremony In Wanaparthy
వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండల గ్రామాలకు సమైక్య పాలకుల అన్యాయం కారణంగా ఇప్పటివరకు సాగునీటి వసతులు లేవు. పెద్దమందడి మి నహా ఇతర మండలాలకు ఎంజీకేఎల్‌ఐ, భీమా ప్రాజెక్టుల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో సాగునీటి వనరులు సమకూరడంతో రైతులు పుష్కలంగా సాగు చేసుకుంటున్నారు. స్వంత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఈ మండలానికి గుర్తింపు తెచ్చేందుకు, సాగు నీటిని తరలించేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తోడ్పాటునివ్వడంతో పెద్దమందడి మండల గ్రామాలకు సాగునీటి యోగం పట్టనుంది. ఇటీవలే ఖిల్లాఘణపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేసుకుని గణపసముద్రంను నింపుకుంటున్న తరుణంలో నేడు జిల్లాలోని మరో మండలానికి కృష్ణమ్మను పరుగులు పెట్టించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుద్దారం కుడి కాలువ ద్వారా ప్రత్యేకంగా 24 కిలోమీటర్ల మేర కాలువను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల గ్రామాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేస్తున్న ఈ కాలువ కోసం మంత్రి హరీశ్‌రావు ద్వారా నిరంజన్‌రెడ్డి రూ.18 కోట్ల 70 లక్షలను మంజూరు చేయించారు.