పవన్ అనంతపురం పర్యటన : రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ !

Oneindia Telugu 2018-01-27

Views 1

Janasena Party president Pawan kalyan reached Anantapur on Saturday morning. And Intracts with farmers

ds : తాను ఎవరి పక్షం కాదని, తాను ప్రజాపక్షమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం అనంతపురంకు చేరుకున్నారు. భారీ ఎత్తున వచ్చిన అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుత్తిరోడ్‌లో జనసేన ఆఫీసుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు.తాను ఓట్లు, సీట్ల కోసం రాలేదని, తాను మంచి చేస్తానని అనుకుంటేనే తన వెంట రావాలని, ఓట్లు వేయాలని అన్నారు. తనకు సినిమాల కంటే ప్రజాసేవలోనే సంతృప్తి ఉందని పవన్ తెలిపారు. తాను కుల, మత, కుటుంబ రాజకీయాలు చేయనని అన్నారు. తనకు రైతులు, యువత కష్టాలు తెలుసునని చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు.కాగా, ఒక్కసారిగా పవన్‌పైకి అభిమానులు దూసుకొచ్చారు. ఓ అభిమాని.. పవన్‌ను గట్టిగా కౌగిలించుకుని వదల్లేదు. దీంతో పోలీసులు వచ్చి విడిపించారు. ఆ తర్వాత పవన్‌తో సెల్ఫీ దిగి అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. పలువురు అభిమానులు బహూకరించిన నాగలితో పవన్ ఫొటోలు దిగారు. భారీ గజమాలతో తమ అభిమాన నేతను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ అభిమానుల నినాదాలు వినిపించాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS