IPL Auction 2018: Know here Sold Players and Highest Bids
ఐపీఎల్ వేలం 2018: ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు
కేఎల్ రాహుల్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 11 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, మనీష్ పాండే కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 11 కోట్లు వెచ్చించింది. శనివారం జరిగిన ఐపీఎల్ మార్నింగ్ సెషన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాజ్ జట్టు సహా యజమాని ప్రీతి జింటా చాలా ఉత్సాహాంగా కనిపించారు.బెంగళూరు వేదికగా శనివారం (జనవరి 27)న ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ వేలం మార్నింగ్ సెషన్‌లో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సెషన్ పంజాబ్ ప్రాంఛైజీ రవిచంద్రన్ అశ్విన్ (రూ. 7.6 కోట్లు), యువరాజ్ సింగ్ (రూ. 2కోట్లు), ఆరోన్ ఫించ్ (రూ. 6.2 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 5.6 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు-రైట్ టు మ్యాచ్)లను వేలంలో కొనుగోలు చేసింది. ఇక, గంభీర్‌ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది.