IPL Auction 2018 ఐపీఎల్ వేలం 2018

Oneindia Telugu 2018-01-27

Views 6.2K

An original pool of 1122 has been trimmed down to 578 cricketers: of these, 360 are Indian - 62 capped and 298 uncapped - and the rest overseas players. The list includes 182 capped, 34 uncapped and two Associates players.

ఐపీఎల్ వేలం కోసం ఇప్పటివరకు 578 క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరందరిని వారి రోల్స్‌ను బట్టిన గ్రూపులుగా విభజిస్తారు. వేలం వేసేవాడు ఒక్కో ప్లేయర్ పేరుని బహిరంగంగా చెబుతూ అతడి కనీస ధరను ప్రకటిస్తాడు. ఈ క్రమంలో ప్రాంఛైజీలు అతడి కనీస ధరకు ఓకే అయితే బిడ్డింగ్ వేస్తాయి. ఏదైనా ప్రాంఛైజీ బిడ్డింగ్‌లో ఆటగాడిని కోనుగోలు చేస్తే అతడు అమ్ముడుపోయినట్లు. ఆటగాడి కోసం ఓ జట్టు బిడ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లైతే, వేలం వేసే వాడు ఆ ఆటగాడి మాజీ ఓనర్‌ను అడుగుతాడు. ఈ సమయంలో మాజీ ఓనర్‌ ఆ ఆటగాడిని కోనుగోలు చేయాలనుకుంటే రైట్ టు మ్యాచ్ కార్డు వినియోగించుకుంటాడు. దీంతో అంతకముందు ధరకే పాత ఓనర్ వేలంలో ఆ ఆటగాడిని దక్కించుకునే అవకాశం లభిస్తుంది.ఐపీఎల్ 11వ సీజన్ కోసం వేలం 27, 28 తేదీల్లో జరుగుతుంది. ఈ రెండు రోజుల్లో ఎవరైనా ప్లేయర్లు అమ్ముడు పోనట్లైతే... అందరు ప్లేయర్లు వేలం ముగిసిన తర్వాత మరోసారి వీరి గురించి వేలంలో మరోసారి ప్రస్తావన వస్తుంది. రెండోసారి వేలంలో ప్లేయర్లు కనీస ధర సగానికి పడిపోతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS