అభయ్‌ కిడ్నాప్, హత్య మిస్టరీ

Oneindia Telugu 2018-01-26

Views 230

Abhay case has been solved by the Hyderabad police with cell phone locations.

పదో తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. 2016లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారనేది ఆసక్తికరమైన విషయమే. అభయ్‌ను స్కూటీపై తీసుకెళ్లిన కుర్రాడిని చిన్నసాయిగా గుర్తించి అతడ్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో దొరికిన హంతకుల ఫోన్‌లో నెంబర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసు దర్యాప్తును వేగిరం చేసి నిందితులను పట్టుకోగలిగారు.
అభయ్‌ తండ్రి రాజ్‌కుమార్‌ హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నాడని, అతడి వద్ద రూ.కోట్లు ఉన్నాయన్న సమాచారంతో నిందితులు తొలుత అభయ్‌ను అపహరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేయాలని అనుకున్నారు. చిన్న సాయికి డబ్బు ఆశ చూపించి అభయ్‌ను తీసుకురావాల్సిందిగా పురమాయించారు. అభయ్‌ అపహరణ కోసం నిందితులు ఆరు నెలలుగా పథకం రచిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
రూ.10కోట్లు డిమాండ్‌ చేసి, రూ.5కోట్లు కచ్చితంగా కావాలంటూ ఫోన్‌లో బెదిరించిన వ్యక్తి విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఫోన్‌ పారేసి పరారయ్యాడు. ఆ ఫోన్‌లోని నంబర్లపై నిఘా వేసిన పోలీసులు చిన్నసాయిని పట్టుకోగలిగారు. చిన్నసాయి అందించిన సమాచారం ప్రకారం ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS