Three lost life in a Bus mishap occurred in Nellore district on Thursday morning.
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
నెల్లూరు జిల్లాలోని కావలి మండలం మద్దురపాడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన సామవేదం సూర్యకుమారి, విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్, రాజమహేంద్రవరం మోరంపూడి గ్రామానికి చెందిన రామదాసులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న కావలి రూరల్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోపక్క వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ బస్సు గురువారం తెల్లవారుజామున బోల్తాపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలుకాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.