నా కొడుకు లేకుంటే.. అర్జున్‌రెడ్డిని నేనే ట్రై చేసేవాడిని..!

Filmibeat Telugu 2018-01-22

Views 518

Sketch is a 2018 Tamil action thriller film, written and directed by Vijay Chandar and produced by Moving Frame. The film features Vikram and Tamannaah in the leading roles, with Soori, Vishwanath and R.K. Suresh among others portraying supporting roles. This movie is going to release in Telugu soon. In this occassion Vikram speaks to Telugu Filmibeat exclusively..


అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా విక్రమ్ ముద్రవేసుకొన్నాడు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు చియాన్. తాజాగా తన నట వారసుడిగా ధ్రువ్‌ను విక్రమ్ సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగానికి ధ్రువ్ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ గురించి పలు విషయాలను ఆయన వెల్లడించారు.
వాస్తవానికి ధ్రువ్‌ని రెండు మూడేళ్ల తర్వాత సినిమా రంగానికి పరిచయం చేయాలని ప్లాన్ చేశాం. అనుకోకుండా అర్జున్ రెడ్డి సినిమాతో రెడీ అయ్యాడు. ముందు నేను ఒప్పుకోలేదు. కానీ ఓ నిర్మాత వచ్చిన అర్జున్‌రెడ్డి రైట్స్ కొన్నాను అని చెప్పాడు. అయితే ఇంకా నటుడిగా ఒక పరిణితి చెందలేదని నేను ఒప్పుకోలేదు.
ధ్రువ్ డబ్‌స్మాష్ వీడియోలు చూశాను. అర్జున్‌రెడ్డి సినిమాకు ధ్రువ్ యాప్ట్ అనిపిస్తున్నాడని ఒత్తిడి చేయడంతో సరే అన్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూశాను. ఆ క్యారెక్టర్‌కు ధ్రువ్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది.
అర్జున్‌రెడ్డి ఆఫర్ విషయాన్ని ధ్రువ్‌కు చెప్పాను. అయితే ఇప్పుడే సినిమాలు చేయడం ఇష్టం లేదు అని చెబితే.. లేదు లేదు.. సినిమా చేస్తే బాగుంటుంది అని అన్నాను. అర్జున్‌రెడ్డి సినిమా చూశావా అని కన్ఫర్మ్ చేసుకొన్న తర్వాత ఓ షరతుతో సినిమా చేయడానికి అంగీకరించాడు. దాంతో అర్జున్‌రెడ్డి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఆ తర్వాత సినిమాను అనౌన్స్ చేసి వర్మ టైటిల్‌ను ప్రకటించాం.
అర్జున్‌రెడ్డి సినిమా నాకు స్వయంగా చేయాలనిపించేంతగా క్రేజ్ ఉంది. కానీ ఎవరైనా నన్ను అడిగితే నేను చేయడానికైనా రెడీగా ఉన్నాను. విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా చేశాడు. ధ్రువ్ కరెక్ట్‌గా సరిపోతాడు. నా కొడుకు లేకుంటే నేను అర్జున్‌రెడ్డిని ట్రై చేసేవాడిని.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS