YSR Congress Party chief YS Jagan Mohan Reddy is on top in Google Trends.
గూగుల్ ట్రెండ్స్‌లో వ్యక్తిగతంగా చూస్తే వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి, పార్టీ పరంగా చూస్తే తెలుగుదేశం గురించి ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి గూగుల్ ట్రెండ్స్ లెక్కల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. ట్రెండ్స్ లెక్క ప్రకారం.. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఆయన గురించి నెటిజన్లు వెతికే వైఖరిలో మార్పు వచ్చిందట.
జగన్ పాదయాత్ర ప్రారంభించకముందు జగన్ కేసుల గురించి, బెంగళూరులోని ఆయన విలాసవంతమైన భవనం గురించి నెటిజన్లు ఎక్కువగా వెతికే వారని, కానీ ఇప్పుడు మాత్రం యాత్ర ప్రారంభమయ్యాక ఆయన యాత్రకు సంబంధించిన విషయాలు వెతుకుతున్నారట.
జగన్ ప్రజా సంకల్ప యాత్రతో పాటు జగన్ కూతురు గురించి, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట. సరాసరిగా జగన్‌కు సంబంధించిన 25 ప్రశ్నలను తీస్తే అంతులో 22 పాదయాత్ర కు సంబంధించినవి ఉన్నాయంటున్నారు. మిగిలిన వాటిలో పారడైజ్ పేపర్స్, జగన్ కూతురు, ప్రశాంత్ కిషోర్‌ల గురించి ఉన్నాయి.