The richest 1 per cent in India cornered 73 per cent of the wealth generated in the country last year, a new survey showed on Monday, presenting a worrying picture of rising income inequality.
భారత దేశంలో 73 శాతం సంపద గత ఏడాది కేవలం 1 శాతం మంది చేతిలోకి వెళ్లిందని ఓసర్వేలో వెల్లడైంది. ఇంటర్నేషనల్ రైట్స్ గ్రూప్ ఆక్స్‌పామ్ సర్వే ఈ విషయం వెల్లడించింది.
ఈ ఆర్థిక అసమానత ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోందని ఈ సర్వే పేర్కొంది. గత ఏడాది 82 శాతం సంపద ప్రపంచవ్యాప్తంగా కేవలం ఒక శాతం మంది చేతుల్లోకి వెళ్లింది. 3.7 బిలియన్ ప్రజల సంపదలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యానువల్ మీటింగ్‌ను ఆక్స్‌ఫాం సర్వే గమనిస్తోంది. ఇక్కడికి వచ్చే ప్రపంచ ప్రముకులు, నేతలు ప్రధానంగా ఆదాయం, జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతారు.
గత ఏడాది సర్వే ప్రకారం భారత దేశంలో 58 శాతం సంపద కేవలం 1 శాతం మంది చేతిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది 50 శాతంగా ఉంది. ఈ లెక్కన భారత దేశంలోనే అసమానత ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే, 2010 నుంచి తీసుకుంటే సరాసరి 13 శాతం ఎక్కువ ఆదాయం బిలియనీర్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రతి ఏటా ఇది కేవలం రెండు శాతంగా ఉంటుంది.
మన దేశంలో, ఇండియన్ గార్మెంట్స్ కంపెనీని లీడ్ చేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఏడాది ఆదాయాన్ని తీసుకుంటే.. ఓ డెయిలీ మినిమమ్ వేజ్ వర్కర్ అంత మొత్తం సంపాదించాలంటే 941 ఏళ్లు పడుతుంది. అమెరికా విషయానికి వస్తే ఓ సీఈవో ఒక రోజులో పొందే వేతనం అమెరికాలోని ఓ సామాన్యుడు ఏడాదిలో సంపాదిస్తాడు. ఈ సర్వేను పది దేశాల్లో 70,000 మందితో చేశారు. ఇందులో ప్రతి మూడింట రెండొంతుల మంది ఓ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక అసమానతలపై వెంటనే చర్యలు ఉండాలని అభిప్రాయపడ్డారు.