The order of the astrological signs is Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces. ... In Western and Indian astrology, the emphasis is on space, and the movement of the Sun, Moon and planets in the sky through each of the zodiac signs.
తెలుగు ప్రేక్షకులకు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమస్సుమాంజలి.. 21-1-2018 వ తేదీ ఆదివారం నుండి 28-1-2018 శనివారం వరకు వార ఫలాలు ఇప్పుడొకసారి పరిశీలిద్దాం..హేమలంబి నమ సంవత్సరం, ఉత్తరాయనం,శిశిర ఋతువు , మార్గశిర మాసం.. మాఘ శుద్ద చవితి మద్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు వుంది. పూర్వ భద్ర నక్షత్రం రాత్రి తెల్లవారితే మద్యాహ్నం 4 గంటల 35 నిమిషముల వరకు వుంది. అమృత సమయం ,రాహు కాలం ,వర్జ్యం ,యమ గండం, సమయాలు..మేష రాశి వారికి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పధం లో నడుస్తాయి. పిల్లలతో ఆనందంగా వుంటారు. అనుకున్న పనులు కార్య దీక్షతో చేస్తారు. తల్లి గారి ఆరోగ్య విషయం లో శ్రద్ద అవసరం. భార్య సహకారం తో లాభాలు చేకుర గలవు. వృషభ రాశి వారికి పని వారి సహకారం వుంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్నిస్తాయి. సోదరుల సహకారం కుడా వుంటుంది. మిధున రాశి వారు దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు కలవు. భార్య సహకారం తో అన్ని పనులు పూర్తి చేయగలవు. కర్కాటక రాశి వారికి ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పై శ్రద్ద వహించవలసి వుంటుంది. సింహ రాశి వారు వృత్తి కొరకు అభివృద్ధి ప్రణాలికలు చేస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభించగలదు. కన్య రాశి వారికి దూరపు బంధు ప్రనలికలుంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తుల రాశి వారు చేయు పనులు ఆలస్యాన్ని ఇవ్వడం తో చిరాకు వస్తుంది. అధిక కోపం తో కొన్ని పనులు చేజారే అవకాసం వుంది. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ధనం కోసం ఆలోచన చేయవలసి వుంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. ధనూ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించవలసి వుంటుంది. కొన్ని కలహాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. మకర రాశి వారికి పిల్లలతో వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు పట్ల పట్టుదల అవసరం.కుంబ రాశి వారికి బంధు మిత్రులు కలుస్తారు. సహచరుల సహకారం వుంటుంది. తల్లి గారి ఆశీర్వాదం పొందుతారు. తండ్రి గారి అనుగ్రహం పొందవలసిన సమయం. అధికారుల మన్ననలు పొందుతారు. మీన రాశి వారు అనుకున్న పనులు ఆటంకాల తో వాయిదా పడతాయి. అధికారులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగజేస్తాయి.