District court on Saturday fired at Collector Amrapali for not paying rent to icds building.
కలెక్టర్ ఆమ్రపాలి కాటాపై జిల్లా కోర్టు శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీడీఎస్ అద్దె భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయానికి వాడుకుంటూ.. రూ.3లక్షల అద్దె బకాయిలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జీ.. జిల్లా కలెక్టర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అద్దె చెల్లించడంలో జాప్యం కారణంగా కలెక్టర్ కారును జప్తు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ కారును స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది సిద్ధమయ్యారు.