కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ.. 20మంది ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు..!

Oneindia Telugu 2018-01-19

Views 181

In a big setback for the Aam Aadmi Party (AAP), the Election Commission on Friday disqualified 20 of its MLAs for holding 'office of profit', Times Now has reported.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. నివేదికను రాష్ట్రపతికి పంపిన ఈసీ.. ఆ 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది. 2015లో 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటీలుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నియమించారు.
కాగా, ఎమ్మెల్యేలను లాభదాయక పదవుల్లో నిమించారనే అభియోగాలు రావడంతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో చిక్కులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు.. ఇది మరో ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. అయితే, ఈసీ సిఫారసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది కేజ్రీవాల్ ప్రభుత్వం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS