రసం అనేది చాలా కుటుంబాలలో రోజువారీగా తయారుచేసే సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆహారంగా చెప్పవచ్చు. రసం ఒక స్పైసి మరియు పుల్లని సూప్. వేడి అన్నంలో కలుపుకొని తింటారు. టమోటా రసం అనేది టమోటా మరియు భారతీయ మసాలా దినుసులతో కలిపి సుగంధ సూప్ గా తయారుచేస్తారు. దీనిని అందరు తినవచ్చు. సాధారణంగా అనారోగ్యంతో ఉన్న పిల్లలు మరియు పెద్దవారికి రసంతో భోజనం పెడతారు.ఈ రెసిపీలో పప్పుధాన్యాలు ఏమి ఉండవు. ఏది ఏమైనా రసం చిక్కదనం కోసం ఉడికించిన కందిపప్పును కలపవచ్చు. నిమ్మరసం, మిరియాలు రసం,ఉలవలు రసం వంటి అనేక రకాల రసాలను తయారుచేయవచ్చు. టమోటో రసం అనేది సాధారణంగా తయారుచేస్తారు. రసం చాలా సులభంగా తయారుచేసే ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన దక్షిణ భారతీయ వంటకం. ఇక్కడ టమోటా రసం ఎలా తయారు చేయాలో వీడియో రెసిపీ ఉంది. అలాగే, రసమును ఎలా తయారుచేయాలో వివరణాత్మక స్టెప్ బై స్టెప్ విధానంలో చూసి అనుసరించండి.