Sr Ntr Family Members Harikrishna, Jr NTR, Kalyan Ram Visit Ntr Ghat today occasion of NTR on 22nd death anniversary. Check out photos.
మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు నందమూరి తారక రామారావు 22 వర్థంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు భారీగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ వారసులైన కొడుకు హరికృష్ణ, బలకృష్ణ, మనవళ్లు, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ ను సందర్శించారు.
గురువారం ఉదయం ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఘాట్ ను సందర్శిచి నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ గురించి, ఆయన గొప్ప తనం గురించి భావితరాలకు తెలిసేలా తన తండ్రి జీవితంపై బయోపిక్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే..తాతయ్య భౌతికంగా లేక పోయినా ఆయన ఆత్మ తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో ఎప్పుడూ ఉంటుందని జూ ఎన్టీఆర్ తరచూ చెబుతుంటారు.
ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి..నటుడిగా, ముఖ్య మంత్రిగా ఆయన తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేశారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తేవడానికి ఎంతో కృషి చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు.