టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం.. శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ !

Oneindia Telugu 2018-01-16

Views 136

RK Nagar MLA TTV Dhinakaran, who was expelled from the AIADMK by the ruling group led by chief minister Edappadi K Palaniswami and deputy CM O Panneerselvam, is in a mood to start a movement of his own.

అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మంగళవారం పుదుచ్చేరిలో తన మద్దతుదారులతో టీటీవీ దినకరన్ మంతనాలు జరపడనానికి వెళ్లారు.
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ (ఎంజీ. రామచంద్రన్) జయంతి వేడుకల నేపథ్యంలో బుధవారం టీటీవీ దినకరన్‌ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్‌ స్వతంత్ర్య పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రతిపక్షం డీఎంకే పార్టీకి టీటీవీ దినకరన్ చుక్కలు చూపించారు.
మార్చి నెల చివరికి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కూలిపోతుందని, అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు రావాలని టీటీవీ దినకరన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీవీ దినకరన్ తన మద్దతుదారులతో పుదుచ్చేరిలో సమావేశం అవుతున్నారు.
పన్నీర్ సెల్వం డిమాండ్ మేరకు చిన్నమ్మ శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ తో సహా వారి వర్గంపై వేటు వేసి పార్టీ నుంచి బహిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీలో సభ్యత్వం, రెండాకుల చిహ్నం కూడా కోల్పోయిన నేపథ్యంలోనే టీటీవీ దినకరన్‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేశారని వెలుగు చూసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS