మోదీ ని విశ్వసిస్తున్నా లేదంటే.. బాబు షాకింగ్ కామెంట్స్..!

Oneindia Telugu 2018-01-12

Views 1.1K

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Friday morning met Prime Minister Narendra Modi.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు ఇరువురు అరగంట పాటు భేటీ అయ్యారు. విభజన హామీలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి అందించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తిస్థాయి అంచనాలను ఆమోదించడం, అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం, రాష్ట్రంలో శాసన సభ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచడం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
సేవా రంగంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉందని చంద్రబాబు అన్నారు. ఈ రంగంలో ఏపీకి ఆదాయం తక్కువ అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల సగటు ఆదాయంలో ఏపీకే తక్కువ అని చెప్పారు. సేవారంగంలో తక్కువ ఉన్నప్పుడు ఆదాయం తగ్గుతుందని చెప్పారు. సేవా రంగంలో తెలంగాణకు ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు కంటే వెనుకబడి ఉన్నామని చెప్పారు.
హేతుబద్ధద లేని విభజన వల్లే ఏపీకి అన్నింటా ఇబ్బందులు అని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీలో ఇవ్వాల్సినవి అన్ని కూడా అడిగానని చెప్పారు. ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లు ఇప్పించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. రెవెన్యూ లోటు కింద కూడా 3900కు పైగా ఇచ్చారని, మిగతాది ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS