Janmabhoomi2018 : జన్మభూమి -మాఊరు : టెక్నాలజీ తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి

Oneindia Telugu 2018-01-11

Views 52

The government of Andhra Pradesh is working relentlessly to ensure that welfare schemes reach the beneficiaries. CM Nara Chandrababu Naidu at Janmabhoomi Maa Vooru programme being held in Tallapudi Village, West Godavari District.

1. దేశంలో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చర్చించుకునే స్థాయికి చేరుకున్నామని. ఇప్పుడు పేదరికంపై విజయం సాధించేందుకు మైలురాళ్లను నిర్ధేశించుకుని సమిష్టి కృషి చేస్తున్నాము అని జన్మభూమి కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. సాంకేతిక ఫలాల ద్వారా పాలనలో పారదర్శకత్వం, నిబద్ధత రావడమే కాదు ప్రజల జీవన ప్రమాణాలూ మెరుగుపడాలి. ఆర్థిక స్థితిగతుల్లో అసమానతలు తొలగి అభివృద్ధి ఫలాలను అందరూ అనుభవించాలి. అందుకు నిదర్సనం అంటూ tdp రిలీజ్ చేసిన వీడియో మీరూ చూడండి.
2. ప్రజా పరిపాలనలో ఓ నూతన అధ్యాయానికి తెరతీసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రియల్ టైమ్ గవర్నెన్స్, ఫైబర్ గ్రిడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ప్రవేశపెట్టి, దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకే అందిస్తూ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తోంది.
౩. ఈ వీడియోలో కన్పిస్తున్న పిల్లాడి పేరు శశాంక్‌. శాంతిపురం మండలంలోని పెద్దూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాల వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన 'జన్మభూమి -మాఊరు' బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి ప్రోత్సహించగా మైకును అందుకున్న శశాంక్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు, చంద్రబాబు పాలనపై అనర్గళంగా పది నిమిషాలపాటు ప్రసంగించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS